పెనగలూరు మండలం, చక్రంపేట, కొండూరు ఉన్నత పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భముగా శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాద్యాయులు, విద్యార్థులు గిడుగు రామ్మూర్తి చిత్ర పటానికి, ఆలాగే హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. చక్రంపేట ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు వి. ప్రసాద్ ను ప్రధానోపాధ్యాయుడు లేబాకు గోపాలకృష్ణ ఉపాధ్యాయులు కలిసి సన్మానించారు. కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు రహమతుల్లాను ఎస్టియు రాష్ట్ర కన్వీనర్ పిల్లి రామకృష్ణ శాలువా కప్పి సన్మానించారు.