చంపాపేట డివిజన్ పరిధిలోని మాధవ్ నగర్ కాలనీలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సిసి రోడ్ పనులను పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి బస్తీ ప్రతి కాలనీ రఖదారులను అధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. డివిజన్ పరిధిలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చంపాపేట డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని కార్పొరేటర్ అన్నారు.