నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు మున్సిపల్ శాఖ తరపున అన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శనివారం స్థానిక వినాయక సాగర్ చెరువు బంగల్ పేట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఘాట్ వద్ద భారీ క్రేన్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భారీ వర్షాలతో వినాయక సాగర్ చెరువు పూర్తిగా నిండుకుందని భక్తులు అటువైపు వెళ్ళకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశామన్నారు. మండపాల నిర్వహకులు అధికారులకు సహకరించాలని కోరారు.