జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను డోన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు అలా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి సాయి ఫంక్షన్ హాల్ వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు.