ఆలమూరు మండలం, మూలస్థానం కూడలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో కొత్తపేట మండలం, శీలం వారి పాలెం కు చెందిన తల్లి, కొడుకు గాయపడ్డారు. కొత్తపేట నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు.