కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సాఫీగా మరియు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు నిగూనీడలో కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గంలో రెండు డ్రోన్ కెమెరాలను అదనంగా 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు 300 మంది పోలీస్ పటిష్ట బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.