రాజమండ్రిలోని పుష్కరాల రేపు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సదరు కాంట్రాక్టర్కు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. గోదావరి వ్యూ పాయింట్ నగర ప్రజలకు చాలా కీలకంగా ఉందని దానికి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు మరియు అధికారులకు సూచించారు.