ఏటూరునాగారం- మంగపేట మధ్య ప్రధాన రహదారి గుంతల మయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ఇసుక లారీలు ఈ మార్గం గుండా వెళ్తాయని ఏ గుంత ఎక్కడ ఉందో తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వెంటనే గుంతలు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.