ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. నేడు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 20, గృహ నిర్మాణ శాఖ 10, పెన్షన్ 2, ఉపాధి కల్పన 2 , ఇతర శాఖలకు సంబంధించినవి 17 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.