చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం ఐదు గంటల నుండి చెప్పులను వరుసలో పెట్టి నిలబడ్డారు, మహిళలు సైతం ఇంటి వద్ద తమ పనులన్నీ వదలుకొని ఉదయం నుండే బారులు తీరారు, పంట కలుపు కలిసి 20 రోజులు గడుస్తున్న యూరియా మందు చల్లకపోతే మా పంట ఎలా పండుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, యూరియా కోసం రైతులు ఒకరినినోకరు కొట్టుకున్నారు, పోలీసుల పహారాలో ఒక వ్యక్తికి రెండు యూరియా సంచులను అందజేశారు, చిన్న శంకరంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతులు నిన్నటి నుండి యూరియా కోసం పని గాపులు కాస్తున్నామన్నారు.