నల్గొండ జిల్లా: భూమికోసం భుక్తి కోసం దొరలు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బిజెపి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని ఎమ్మెల్సీ సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆదివారం తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం కు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం తెలంగాణ అగ్ని కనకగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.