గత కొద్దిరోజుల క్రితం గుంటూరు నగర శివారు ప్రాంతమైన రెడ్డిపాలెంలో అఘోర క్షుద్ర పూజల వీడియో ఒకటి ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో మంగళవారం ఉదయం నుండి చాలా వైరల్ గా మారింది. రెడ్డిపాలెం శివాలయం పక్కన ఓ ఇంట్లో నెల రోజుల నుండి అఘోర కుటుంబం చంద్రగ్రహణం నేపథ్యంలో పూజలో నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. తలపై చెప్పులతో కుంపటి పెట్టి అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహించిన వీడియో ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అఘోర తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.