అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న సిండికేట్ నగర్ లో వీధిలైట్ ను ఆపినందుకు వ్యక్తిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటననికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.