వెదురుకుప్పం మండలం మెట్టూరు గ్రామంలో పేకాట శిబిరంపై ఎస్సై వెంకట సుబ్బయ్య తన సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 4740 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.