అయినవిల్లి శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దంపతులు, జాయింట్ కలెక్టర్ నిషాంతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో చేసిన పుష్పాలంకరణ కేరళ వాయిద్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి.