గంట్యాడ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం సాయంత్రం సంకల్పం కార్యక్రమం పై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గంట్యాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి ఉమా భారతి మాట్లాడుతూ, బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇంకా పలు విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధి అనిత, చైల్డ్ లైన్ ప్రతినిధి అనిల్, బెజ్జిపురం ఎన్జీవో ప్రతినిధి పద్మ,కేజీబీవీ ప్రిన్సిపాల్ అల్లు జ్యోతి,ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్లు శాంతి లత,గాయత్రి,అనురాధ, కృష్ణవేణి,మహిళా సంరక్షణ పోలీసు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.