శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా యూరియా అందక రైతులు అవస్థులు పడుతున్నారు. కోటబొమ్మాళి, కొత్తూరు, నరసన్నపేట, శ్రీకాకుళం, టెక్కలి తదితర ప్రాంతాల్లో అన్నదాతలు ఆయా దుకాణాలు వద్ద గంటల తరబడి వేచి ఉన్నా బస్తా ఎరువు దొరకని పరిస్థితి. అధికారులు భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పంపిణీ అంతంతమాత్రమే ఉంది. ఎరువుల కోసం సాగుదారుడు పడుతున్న ఆవేదన, కష్టాలను సోమవారం మీడియాతో తెలిపారు.