విశాఖపట్నంలోని తాటిచెట్ల పాలెం ఎం.ఈ.ఎస్. గేట్ సమీపంలో నెలకొల్పిన 'ఆపరేషన్ సింధూర' వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పహల్గామ్‌లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా భారత భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడికి గుర్తుగా ఈ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ ప్రతిమలో, సింధూరం రంగులో ఉన్న ఆకాశంపై యుద్ధ విమానాలు, రాకెట్లు దూసుకుపోతున్నట్లు చూపించారు. ఈ విగ్రహం ద్వారా భద్రతా దళాల వీరత్వం, దేశ రక్షణ పట్ల వారి అంకితభావాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రత్యేకమైన, దేశభక్తిని గుర్తుచేసే వినాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.