అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నాల్గవ రోజు శనివారం అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కోలాట నృత్యాలు అలరించాయి. వినాయక చవితిని పరిష్కరించుకుని వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం నాల్గవ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఆయా ప్రాంతాలలో చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాలుగు రోజులపాటు వినాయకుని చేతిలో పూజ చేసిన లడ్డూలను వేలం పాటలు నిర్వహించారు. ఇదిలావుండగా కలికిరి మండలం కలికిరి పంచాయతీలోని రాజువారి పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.