ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి తరపున తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటు వేయకుండా ఎన్నికల నుంచి తప్పుకుందని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ గిరిజా షెట్కర్ నారాయణఖేడ్లో మంగళవారం అన్నారు. కల్వకుంట్ల కుటుంబం కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి బానిసగా మారి బిఆర్ఎస్ ప్రేమ కథ కొనసాగుతుందని విమర్శించారు. కేసులు తొలగించుకునేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటుందని ఆరోపించారు.