జనగామ పట్టణంలోని మునిసిపాలిటీ పరిధిలో చేపడుతున్న బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను మున్సిపాలిటీ ఇంజనీరింగ్ ఉద్యాన శాఖ అధికారులతో గురువారం సందర్శించి పనులను పరిశీలించారు.వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలిస్తూ మొరం నింపి అందంగా తీర్చిదిద్దాలన్నారు. వంపు ప్రాంతాలను మరసతో సరి చేయించాలని,విద్యుత్తు వైర్లు సరిచేసి లైట్స్ అన్ని వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.చిల్డ్రన్ పార్క్ లో మట్టి అంటకుండా ఆట వస్తువులు చుట్టు ఇసుకను నింపాలని సూచించారు.