ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ అధికారులతో మరియు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్యాలయం ఆవరణంలో ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరెడ్డి డిప్యూటీ రేంజర్ నాగరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.