చిత్తూరు : చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్)కు 12 వినతులు వచ్చినట్లు కమిషనర్ పి నరసింహ ప్రసాద్ తెలిపారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ - 6, పింఛను -2, ప్రణాళిక విభాగం -2, ప్రజారోగ్య విభాగం -1, టిడ్కో