రాయచోటి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో 10వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే దాదాపు రూ.3 కోట్లు 90 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు అందించాం.ఇవాళ మాత్రమే 69 మంది లబ్ధిదారులకు రూ.71 లక్షల విలువైన రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశాం.మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నిజంగా ఒక మహోన్నతమైనది. అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది అంటారు. అదే విధంగా ఎంతోమంది పేద ప్రజలకు ప్రాణదాతగా సీఎం గారు నిలుస్తున్నారు.