నిర్మల్ జిల్లా : తానూర్ మండలంలోని మొగిలి గ్రామ శివారులో రెండు ఎద్దులపై చిరుతపులి దాడి చేసి చంపేసింది...మసల్గా తాండకు చెందిన దేవిదాస్ జాదవ్ అనే రైతుకు చెందిన ఎడ్లు తన చేనులో కట్టేశాడు. తెల్లవారుజాము సమయంలో చేనులో ఎడ్లు చనిపోయి కనిపించాయి. ఘటన స్థలంలో చిరుతపులి పాద ముద్రలు గమనించి చిరుత దాడి చేసినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రైతు తెలిపారు. రూ. 1.50లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు