పులివెందుల మున్సిపాలిటీలో పలు సమస్యలు తీష్ట వేశాయని, కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ను ఆయన కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల మున్సిపాలిటీలో పలు సమస్యలు కృష్ణవేషాయని ఒకపక్క డ్రైనేజీ, వీధిలైట్ల కొరత ఎక్కువగా ఉందన్నారు. వీధులలో కుక్కలు ,ఆవుల బెడద ఎక్కువగా ఉందని ఆవులను గోశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.