హయత్ నగర్ డివిజన్ లోని కురుమ బస్తీలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ముఖ్యంగా బస్తీలో త్రీఫేస్ కరెంటు లేనందున తరచూ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేరు అవడం జరుగుతుందని కార్పొరేటర్కు తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ త్రీఫేస్ కరెంటు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమకు తెలియజేయాలని స్థానికులను కార్పొరేటర్ కోరారు.