హొళగుంద గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ, కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో రంజిత్ కుమార్ మృతి చెందిన బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు