ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం రహదారిలో వాహనదారులతో ఫారెస్ట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా అయ్యాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది స్పందన వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ నల్లమల ఘాట్ లో వేగంగా వెళుతున్న వాహనాలకు ఫైన్లు విధిస్తున్నామన్నారు. అయితే కొందరు కావాలనే తమతో దురుసుగా మాట్లాడి వీడియోలు తీసి వైరల్ చేశారని పేర్కొన్నారు.