సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.