చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాలలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా పిలవబడే కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయం మూసివేశారు. గ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం 4 గం కు స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారి వెంకటసుబ్బయ్య, పూజారుడు కేసరి, రాజా స్వాములు తెలపారు.