ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ ఒంగోలు సమీపంలోని పేస్ ఇంజినీరింగ్ కాలేజీ లో బుధవారం విద్యార్దులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. రోజురోజుకూ సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, ఈ మోసాల వలలో బడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదువుకున్నవారు, చదవని వారు ఇద్దరూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారని, అందుకే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని వారందరికీ ఈ విషయం తెలియజేయాలని విద్యార్థులను కోరారు. ప్రధానంగా గుర్తుంచుకోవలసిన మోసాలు:ఫేక్ SMSలు, OTP మోసాలు,పై జాగ్రత్తగా ఉండాలన్నారు