అల్విన్ కాలనీ, వివేకానంద నగర్ డివిజన్లో 6.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, రోజా దేవి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉషా ముళ్ళపూడి కమాన్ నుంచి అల్విన్ కాలనీ వరకు రోడ్డు వెడల్పు, చెట్ల తొలగింపు, కరెంటు పోల్స్ మార్పు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు.