సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో డార్మెటరీ హాల్ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో విద్యార్థులు ఎవరు ఆ సమయంలో హాల్ లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆమె వెంట జిల్లా అధికారులు గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు.