జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి జనగామ పట్టణ శాఖ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు సాడ రమేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు తల్లి గారి పై అన్చిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారని అన్నారు