అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకివైపు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.