మనుబోలు మండలం కాగితాలపురు క్రాస్ రోడ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న పంజాబీ డాబా పక్కనే మృతి చెంది ఉండటానికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాడని అనుమానిస్తున్నారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే భిక్షాటన చేసే వాడని.. అనారోగ్యంతో చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన గురువారం సాయంత్రం 6 గంటలకు వెలుగులోకి వచ్చింది.