రామాయంపేట మున్సిపాలిటీలోని 11వ, 5వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో టీపీసీసీ సభ్యుడు చౌదరి సుప్రభాత్రావు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మంజూరైన నిధులతో ఈ రోడ్డు, డ్రైనేజ్ పనులు చేపడుతున్నామని, డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరిగిందని అలాగే ప్రతి ఇంటికి నీటి కలెక్షన్ ఇవ్వడం జరిగిందని, కాలనీలోని మొత్తం సిసి రోడ్లు వేయడం జరుగుతుందని, మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని ఆయన మొత్తం మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సిసి రోడ్లు పూర్తి చేస్తామని, మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.