ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గుండ్లకమ్మ వాగు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గుండ్లకమ్మ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చిన సుమారు 4000 మంది భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ట్రాక్టర్ల సహాయంతో పోలీసులు భక్తులను వాగును దాటించారు భక్తులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ అధికారి రాచర్ల కోటేశ్వరరావు తెలిపారు.