ఏదిక్కు మొక్కు లేని అభాగ్యులకు, అనాదలకు, ప్లాట్ పారంపై పడివున్న వారి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి నడుద్దామని సమాజ సేవకులు, మన్నూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ల్యాబ్ రామ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం లోని వివేకానంద సేవా ఆశ్రమంలో అనాదలకు అన్న దానం చేసి,పండ్లు,స్వీట్స్ పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో దుర్గావాణి సేవాసమితి సభ్యులు నారాయణమ్మ, రత్నమ్మ, కత్తెరగండ్ల శివాలయం చైర్మన్ శ్రీనివాసులు, సురపురెడ్డి రమణారెడ్డి, వివేకానంద సేవాశ్రమం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.