భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్,దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రైతు సంఘం బృందం గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు.కొనిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో రైతులతో కలిసి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను రైతు సంఘం బృందం పరిశీలించింది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు.