విధులలో నిబంధనలు ఉల్లంఘించిన ఎస్.జి.టి. జె.విలాస్ ను విధులనుండి సస్పెండ్ చేయడం జరిగిందని ఐటీడజిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి తెలిపారు. జైనూర్ మండలం సుకుద్ పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎస్.జి.టి.గా పని చేస్తున్న జె.విలాస్ విధులకు మద్యం సేవించి హాజరయ్యారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో ఎస్.సి.ఆర్.పి., జైనూర్ సూచన ప్రకారం ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం సదరు ఎస్.జి.టి.ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.