ఊహించని రీతిలో కురిసిన వర్షానికి పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటల వివరాలు, నీట మునిగిన ఇల్లు, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి విభాగాన్ని అలర్ట్ చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని సీఎంకు ఈటెల రాజేందర్ సూచించారు.