విజయవాడ నగరంలోని అవుట్ ఫాల్ డ్రైనేజీకి రైలింగ్స్ కచ్చితంగా ఏర్పాటు చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక పర్యటన చేశారు. నగరంలో ఉన్న అన్ని మేజర్ అవుట్ ఫాల్ డ్రైనేజీలకు రైలింగ్ వేయాలని నగరంలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని తెలిపారు.