మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ రాష్ట్ర మాజీ DGP గోపినాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి విశిష్టత చరిత్ర గురించి అర్చకులు డిజిపికి వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.