ఖమ్మం నగరంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చెంది ఆకాశమంతా నల్లటి మబ్బులు అలుముకొని వర్షం దంచి కొట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వర్షాలతో, నగరంలో వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలు కాస్త ఉపశమనం పొందారు. అయితే భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమై మోకాలు లోతు నీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఖమ్మం పాత బస్టాండ్ లో వరద నీరు చేరడంతో పాత బస్టాండ్ చెరువులో తలపిస్తుంది.