శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నుంచి హైదరాబాదు వైపు వెళ్తున్న ఓల్వో బస్సు ఆటోని ఢీకొనడంతో ఆటోలోని ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.