భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం 11:30 గంటల సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు ముందర ఒకరోజు ఫీజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీజు దీక్ష కార్యక్రమానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బలరాం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు నరహరి విద్యార్థులకు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు.