వాజేడు మండలం తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిపై రేగుమాగు వద్ద గోదావరి వరద చేరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను పోలీసులు నేడు శుక్రవారం రోజున ఉదయం నుండి నిలిపివేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ టేకులగూడెం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సివస్తే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా వెళ్లాలని సూచించారు.