యాడికి మండల కేంద్రానికి చెందిన బొజ్జన్న అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. అంత్యక్రియలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికులు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఫౌండేషన్ సభ్యులు బాలకృష్ణ, ధ్రువ నారాయణ, లక్ష్మీకాంతమ్మ తదితరులు స్పందించారు. బొజ్జన్న మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులను అందరూ అభినందించారు.